రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎస్ఐ

నవతెలంగాణ – తొగుట
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎస్ఐ. బి. లింగం తెలిపారు. శుక్రవారం మండలంలోని రాంపూర్ గ్రామంలో వాహనదారు లకు, ప్రజలకు, రోడ్డు భద్రత మాసోత్సవాల సంద ర్భంగా మైనర్ డ్రైవింగ్, ట్రాఫిక్ నిబంధనల గురిం చి, రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పిం చారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడిపే వాహనదారులకు రకరకాల గిఫ్ట్ లు, శాలువ తో సన్మానించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడు తూ పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం మోటార్ సైకిల్ వాహనదారులకు, ప్రజలకు చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులకు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు గురించి తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. మోటార్ సైకిల్ వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరిం చాలని ప్రమాదాల నివారణకు కృషి చేయాలని అన్నారు. రోడ్లకు ఇరువైపులా ఏర్పాటుచేసిన సైనింగ్ బోర్డ్స్ సూచనలు, సలహాలు పాటిస్తూ సేఫ్టీ గా డ్రైవింగ్ చేసి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకో వాలని సూచించారు. కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ప్రతి సంవత్సరం భద్రత వారోత్సవాలు ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగు తుందని తెలిపారు. వాహనదారులు ప్రజలలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు. రోజురోజుకు వాహనాల రద్దీ పెరుగుతుందని దాన్ని దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ సెక్యూరిటీగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపవ ద్దని తెలిపారు. పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కు చేసుకోవాలని రోడ్డుకు అడ్డదిడ్డంగా వాహ నాలు పార్కు చేయవద్దని అన్నారు. జరిమానా ఫైన్లు వేయడం మా అభిమతం కాదని ప్రమాదాల నివారణ, రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై మాత్రమే జరిమానాలు విదిస్తు న్నామన్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది,చందాపూర్ మాజీ సర్పంచ్ బొడ్డు నర్సింలు,వాహన దారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love