తొగుట సింగరాల మల్లన్న ను దర్శించుకున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి

నవతెలంగాణ – తొగుట

సింగరాల మల్లన్న ను దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి జాతరకు విచ్చేసి, మల్లికార్జున స్వామిని దర్శించుకొని 
ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం జప్తి లింగారెడ్డిపల్లి మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ మల్లికార్జున స్వామి ఆలయ పునర్నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షు డు అక్కం స్వామి, జిల్లా నాయకులు భూస నిరం జన్ రెడ్డి,యెన్నం భూపాల్ రెడ్డి, ఫిషర్మెన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి,గ్రామ అధ్యక్షు లు కొండల్ రెడ్డి,సిద్ధారెడ్డి,తిరుమలు,నాగరాజు,మల్లయ్య,చంద్రం,కనకయ్య,రమేష్,బిక్షపతి, భాస్కర్ రెడ్డి, స్వామి తదితరులు పాజాతరకుల్గొన్నారు.
Spread the love