నులిపురుగులను నివారించేందుకు ఆల్బెండజోల్ మాత్ర అందించాలి

– వైద్య అధికారి డాక్టర్ రాధకిషన్
నవతెలంగాణ – తొగుట
నులిపురుగులను నివారించేందుకు ఆల్బెండజోల్ మాత్ర అందించాలని వైద్య అధికారి డాక్టర్ రాధ కిషన్ తెలిపారు. సోమవారం మండలంలోని ఆరోగ్య కార్యకర్తలకు, అంగన్వాడి, ఆశా కార్యకర్త లకు ఈనెల 12వ తేదీన జరగబోయే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 సంవత్స రం వయసు నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ నులిపురుగులను నివారించేందుకు ఆల్బెండజోల్ మాత్ర అందించాలని కోరారు. ఈ కార్యక్రమంతో పాటుగ ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు వరకు విటమిన్ “ఏ” కార్యక్రమం నిర్వ హించాలని సూచించారు. ఇందులో భాగంగా 9 నెలల నుండి 5 సంవత్సరాల వయసు గల పిల్లలం దరికీ విటమిన్ “ఏ” టానిక్ అందించాలని ఆదేశిం చారు. మండలంలోని గర్భిణీ స్త్రీలు సాధారణ ప్రస వం జరిగేలా అవగాహన కల్పించాలని, ప్రభుత్వ దవాఖానాలలో ప్రసవాలు జరిగేలా చూడాలని అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను దిశానిర్దేశం చేశా రు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ రాధాకిషన్,ఎం ఎల్ హెచ్ పి లు డా.సాగరిక, సుభా షిని, సిహెచ్ఓ. స్వరూప,సూపర్వైజర్ శ్యామల, ఐసిడిఎస్ సూపర్వైజర్ అమ్తుల్, ఆరోగ్య కార్య కర్తలు, అంగన్వాడి, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love