యేసుక్రీస్తు మానవుల విమోచన క్రయదనమే గుడ్ ప్రైడే

– బేతెస్థ మినిస్ట్రీస్-సూర్యాపేట
– సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ -కరుణ శ్రీ
నవతెలంగాణ – చివ్వేంల
మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు ఖాసీం పేట గ్రామం  నందు బేతెస్థ ప్రార్ధన మందిరంలో ఘనంగా గుడ్ ప్రైడే ఆరాధనా నిర్వహించినారు. ఈ సందర్బంగా బేతెస్థ మినిస్ట్రీస్ ఫౌండర్, సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ క్రైస్తవులకు గుడ్ ప్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా 90 % ప్రజలు ఆరాధిస్తున్న దేవుడు యేసు క్రీస్తూ అనీ, శిలువలో ప్రేమ ను గూర్చి ప్రపంచానికి బోధించారని తెలిపారు.. .గుడ్ ఫ్రైడే అనగా  క్రీస్తును శిలువ వెయ్యటం, కల్వరి కొండ వద్ద అతని మరణం యొక్క జ్ఞాపకాలను గుర్తుచేసుకొనే క్రైస్తవమత విశ్వాసులకి, ప్రపంచ మానవాళికి గొప్ప రక్షణ దినం అని , ఈ పవిత్ర వారం సమయంలో పవిత్రమైన మూడు రోజులలో భాగంగా ఈస్టర్ ఆదివారానికి ముందు వచ్చే శుక్రవారం రోజున యేసు క్రీస్తూ మానవాళి పాపములు క్షమించబడుటకొరకు తన్ను తాను శిలువ మరణం కొరకు తన ప్రాణంను అర్పించుకొన్నాడని  , తరచుగా పాసోవర్ పై యూదుల అభిప్రాయంతో  సరిగ్గా సరిపోలుతుందనీ . దీనిని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే లేదా గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలువబడుతుందనీ ,క్రీస్తు సువార్తల ఆధారంగా క్రీస్తును శిలువ వెయ్యటం శుక్రవారమే జరిగిందనీ. రెండు వేర్వేరు సమూహాలచే గుడ్ ఫ్రైడే యొక్క సంవత్సరం సా.శ. 33 గా అంచనా వెయ్యబడింది, వాస్తవానికి బైబిలికల్, జూలియన్ క్యాలెండర్ల మధ్య ఉన్న వ్యత్యాసాలు, చంద్రవంక ద్వారా ఐజాక్ న్యూటన్ అనే ఖగోలా శాస్త్ర వేత్తచే సా.శ. 34 గా చెప్పబడింది.మూడవ విధానం ఏంటంటే, శిలువ వేసినప్పుడు చంద్రుని కాంతి తగ్గిపోయి చీకటి అవ్వటం, అదే తేదీన అనగా శుక్రవారం ఏప్రిల్ 3, సా.శ. 33 న గ్రహణం ఏర్పడటం (2:20 చట్టాలలో “మూన్ ఆఫ్ బ్లడ్” పై అపోస్తిల్ పీటర్ యొక్క సూచనతో సంబంధం కలిగి ఉంటుందనీ ) ఈ ఆధారంగా చెప్పబడిన ఒక పూర్తి వైవిధ్యమైన ఖగోళపరమైన విధానం సమస్త మానవాళి చేసిన పాపాల కోసం ఆయన సిలువపై ప్రాణాలు అర్పించారు అనీ , సైన్ట్ ఫిక్ గా మరియు బైబిలికల్ గా ఋజువు చేయబడిందని. తిరిగి మూడో రోజు సమాధి నుంచి యేసు క్రీస్తూ లేచాడని,ఆయన పొరుగువారిని ప్రేమించాలని వారి తప్పులను క్షమించాలంటూ తాను భూమిపై జీవించిన రోజుల్లో బోధనలు చేశారని  అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్చ్ బిషప్ యం. పి. హెచ్. హెచ్ మోజెస్, కొమ్ము హోసన్నా, బుడిగే నాగరాజు,పేతురు, ఆదిమళ్ళ బాబు, వల్లెపు సురేష్, యడవెల్లి యేసుపాదం, మిర్యాల కళింగ రెడ్డి, మామిడి కిరణ్, అబ్రాహాము, మీసాల పద్మ,కుంచం వెంకన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love