భక్తి శ్రద్ధలతో ఘనంగ గుడ్ ఫ్రైడే వేడుకలు

నవతెలంగాణ – వీర్నపల్లి
క్రీస్తు శిలువ యాత్ర యాగంతోనే మాన‌వాళికి పాప విముక్తి క‌లిగింద‌ని పాస్టర్ యం ఏసుదాస్ అన్నారు. వీర్నపల్లి మండలం కేంద్రంలోని గ్లోరియస్ గాస్ఫల్ చర్చిలో అడవి పదిర,రంగంపేట, వన్ పల్లి, గర్జన పల్లి, కంచర్ల, గ్రామాల చర్చిలో శుక్ర‌వారం గుడ్ ఫ్రైడే సంద‌ర్భంగా ప్రత్యేక క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు . ఈ సందర్భంగా పాస్టర్ యం యేసు దాస్ మాట్లాడుతూ ఎంతో అద్భుతంగా జ‌రుపుకుంటున్న గుడ్‌ఫ్రేడే ద్వారా ఏసు క్రీస్తూ శిలువలో ప‌లికిన ఏడు మాట‌లు ద్వారా క్ష‌మా గుణం, బాధ్య‌త‌ , ప్రేమ‌ , పాప‌పు ఒప్పుకోలు , ద‌యా గుణాల‌ను అల‌వ‌ర్చుకోవాల‌న్నారు .పాపుల కోస‌మే ఏసూ క్రీస్తు ఈ లోకంలో జ‌న్మించి , శిలువ‌లో ర‌క్తం చిందించి ప్రాణాలు అర్పించిన‌ట్లు తెలిపారు. పాప‌పు జీవితాన్ని వ‌ద‌లి క్రీస్తు చూపిన మార్గంలో న‌డిచి ప‌ర‌లోకం చేరాల‌ని బోధించారు. ఈ కార్య‌క్ర‌మంలో పాస్టర్ లు నతనియేలు, పౌలు, సంసొన్, ప్రభు దాస్, అబ్రహం, జోసెఫ్, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love