రాజ్యాంగ రక్షణ యాత్రను విజయవంతం చేయండి

– జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్
నవతెలంగాణ – నెల్లికుదురు
ఏప్రిల్ రెండవ తేదీ నుండి 8వ తేదీ వరకు  జాతీయ మాల మహానాడు ఆధ్వర్యలో నిర్వహించబోయే రాజ్యాంగ రక్షణ యాత్రను ప్రతి ఒక్క మాల పాల్గొని విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు మండల అధ్యక్షుడు కారం ప్రశాంత్ అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో అద్దంకి సైన్యం యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు గారా ఉపేందర్ తో కలిసి సంబంధిత కరపత్రాన్ని శుక్రవారం ఆవిష్కరించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల మాసంలో భాగంగా ఏప్రిల్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ రక్షణ యాత్రను చేపట్టబోతున్నామని, దీనికి ప్రతి ఒక్క కార్యకర్త కదిలి వచ్చి విజయవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు ఈ కరపత్రం ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామికవాదులు బుద్ధి జీవులు రాజకీయాలకు అతీతంగ మద్దతు తెలిపి రాజ్యాంగ రక్షణలో భాగస్వాములు కావాలని అన్నారు. ఏప్రిల్ 8వ తేదీన హైదరాబాదులో ముగింపు రాజ్యాంగ రక్షణ యాత్ర సదస్సు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని దీనికి ప్రతి ఒక్కరు రావాలని తెలిపారు. రాజ్యాంగ రక్షణ యాత్ర లో బహుజనులు అంబేద్కర్ వాదులు,  ప్రతి ఒక్కరూ అధిక సంఖ్యలో పాల్గొని రాబోయే రోజులల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఈ రాజ్యాంగ రక్షణ యాత్ర ను విజయవంతం చేయాలని రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అద్దంకి సైన్యం యువసేన మండల అధ్యక్షులు బాణాల సంజీవ నెల్లికుదురు గ్రామ అధ్యక్షులు బూర్గుల రజిని కుమార్ బోటిమంచి యాకయ్య కారం రవి బాణాల వీరన్న గార అనిల్ గార వరుణ్  జాతీయ మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love