16న జరిగే దేశ వ్యాప్త గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయండి

– సీఐటీయూ నెల్లికుదురు మండల కార్యదర్శి ఇసంపెల్లి సైదులు పిలుపు
నవతెలంగాణ – నెల్లికుదురు
ఈనెల 16న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బందును విజయవంతం చేయాలని సీఐటీయూ నలుగురు మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు తెలిపారు. నెల్లికుదురు మండల కేంద్రంలో స్థానిక విశ్రాంతిభవనంలో  తోట నరసయ్య అధ్యక్షతన జరిగిన ప్రజా సంఘాల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పరిపాలిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 16న జరిగే  గ్రామీణ బారత్  బందును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.  హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నాలుగు కోడ్ చట్టాలు రద్దు చేయాలని కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ మరియు స్కీం వర్కర్లను గుర్తించాలని అంగన్వాడి ఆశ వీవోఏలకు కనీస వేతనం అమలు చేయాలని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్కావెంజర్లను తిరిగి తీసుకోవాలని, కేంద్రం ద్వారా అమలు చేస్తున్న ఈ స్కీం వర్కర్ల బడ్జెట్  తగ్గించొద్దు స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఉపాధిహామీ పని దినాలు పెంచాలని రోజు వారి కూలి రూ.600 ఇవ్వాలని. వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని. విద్యుత్తు సవరణ బిల్లును రద్దు చేయాలి. 16వ తేదీన జరిగే దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ లో  ప్రజలు  కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావులు వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పేరుమాండ్ల పుల్లయ్య వెంకన్న రాంకోటి శ్రీను ఐలేష్ రవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love