గ్రామాలు పచ్చగా కళకళలాడుతూ ఉండాలి

– గ్రామాలలో త్రాగునీరు సమస్య లేకుండా చూడాలి
– పారిశుద్ధ్య సమస్య లేకుండా ఉంచాలి
– గ్రామంలో ఎలాంటి సమస్య తలెత్తిన తక్షణమే చర్యలు చేపట్టాలి
– మహబూబాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
నవతెలంగాణ – నెల్లికుదురు
గ్రామాలలో స్వచ్ఛత పెంపొందించేందుకు పారిశుద్ధ్యం మెరుగుపరచి గ్రామాలు పచ్చగా అన్ని రంగాలుగా అభివృద్ధితో కలకలాడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు ఫిబ్రవరి 7 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నాలుగవ రోజు నెల్లికుదురు మండలంలోని నరసింహుల గూడెం గ్రామంలో అదనపు కలెక్టర్ ఆకస్మికంగా శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సంబంధిత రిజిస్టర్ లను పరిశీలించారు అనంతరంగ్రామ పంచాయతీ కార్యాలయం, అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాలను  సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించి తదుపరి ఆ గ్రామంలో ఉన్న వైద్య సబ్ సెంటర్ ఆయన పల్లె దావఖాన ను సందర్శించి వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు.గ్రామ ప్రజలతో త్రాగునీటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు,  లేదని నిరంతరం త్రాగునీరు అందుతున్నదని స్థానికులు తెలిపారు కానీ, పాత ట్యాంకు కు మరమ్మత్తులు అవసరమని, అందుకు నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని  ప్రజా ప్రతినిధులు అదనపు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అనంతరం అంగన్వాడి కేంద్రంలో రికార్డులను పరిశీలిస్తూ మామ్ శ్యామ్ రిజిస్టర్ ల ను ఏర్పాటు చేయాలని తెలిపాడు. అదేవిధంగా పాఠశాల లో విద్యార్థులతో గణిత శాస్త్రం మీకు ఎలా అర్థం అవతున్నది  చేసి చూపించండి అని విద్యార్థులచే చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలివితేటలను ప్రశంసించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్ లో త్రాగునీటికి పారిశుద్ధ్యనికి ప్రాధాన్యత ఇచ్చినందున ఎటువంటి సమస్యలు తలెత్తిన తక్షణం స్పందించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో శానిటేషన్ నిర్వహణను పెంచాలన్నారు. మరుగుదొడ్ల ను  ప్రభుత్వం పాఠశాలల్లో సౌకర్యాలను మెరుగు పరుస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రాజు, ఎంపీడీవో శేషాద్రి, ఎంపీ ఓ బండారు పార్థసారథి పంచాయతీ కార్యదర్శి మణిదీప్ వైద్య సిబ్బంది ఉపాధ్యాయులు అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love