సాఫీగా సాగిన మండల సర్వసభ్య సమావేశం

– ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు
– నరసింహుల గూడెం ఆలేరు రైతులకు నష్టపరిహారం అందించాలి
నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో మండల సర్వసభ్య సమావేశం సాఫీగా సాగిందని ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు తెలిపారు సర్వసభ్య సమావేశాన్ని జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటగా వస్త్రం తండా గ్రామ మాజీ సర్పంచ్ గుగులోతు జయ ఇటీవల మృతి చెందగా ఒక్క నిమిషం మౌనం పాటించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులచే మాట్లాడించారు. ఆలేరు నర్సిల్లగూడెం గ్రామాల మీదుగా నేషనల్ హైవే రోడ్డు పనుల క్రింద ఆయా గ్రామాల రైతుల భూములు కోల్పోయిన వారికి గతంలో కొంతమంది ఒక ఎకరాకి రూ.11 లక్షల విలువతో ఒక రైతు భూమి రోడ్డు  క్రింద భూమి పోయిన  వారికి  రూ.11 లక్షల ధరతో కట్టించారని అన్నారు. కానీ అదే రోడ్డు పక్క జిల్లాలో రూ.25 నుంచి రూ.30 లక్షల రూపాయల ధరతో కట్టించారని, ఈ ప్రాంత రైతులకు పక్క జిల్లాల రైతులకు పెట్టిన అంత ధర కట్టకపోవడంతో అక్కడి రైతులు నష్టపోయారని, ఆ గ్రామ ఎంపీటీసీ వేశాల కృష్ణయ్య తెలిపాడు ఒక ఎకరాకి రూ.30 లక్షల ధర లెక్క వెంబడి ఇక్కడ రైతులకు కట్టివ్వాలని సర్వసభ్య సమావేశంలో డిమాండ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం వీరికి తక్కువ ధర కట్టించడం పట్లా రైతుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అనంతరం అంగన్వాడి కార్యక్రమాలు గ్రామాలు అంగన్వాడి కేంద్రాలలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు ఎంపీటీసీలను పిలవాలని ఎంపీటీసీలు కోరినట్టు తెలిపారు. ముప్పారం ఆలేరు రాజుల కొత్తపల్లి గ్రామాల వీధిగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని, ఆ గ్రామాల ఎంపీటీసీ కదిర జగన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు అదేవిధంగా రాత్రంతాండా ఆవులేక తండా మీదుగా కేసముద్రం వెళ్లే బస్సును ఈ తండాల మీదుగా నడిపించాలని, ఆర్టిసి అధికారులను కోరి ఒక వినతి పత్రాన్ని ఆర్టీసీ అధికారికి అందజేసినట్లు ఆ గ్రామ ఎంపిటిసి మదన్ లాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ తాసిల్దార్ కోడి చింతల రాజు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Spread the love