గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం: ఎమ్మెల్యే

నవతెలంగాణ – నెల్లికుదురు

ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో బురదమయం లేకుండా సీసీ రోడ్డు ఉండాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ అన్నారు. మండలంలోని శ్రీ రాజ్య తండాలో ఐదు లక్షలతో సీసీ రోడ్డు పనులను,  రావిరాల గ్రామంలో ఐదు లక్షల తో సీసీ రోడ్డు పనులు , మండల కేంద్రంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంచాల వెంకన్న మృతదేహాన్ని పరామర్శించే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన గ్రామపంచాయతీ చేసిన తండాల అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదని అన్నారు. ఆ తండాలలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లుగా అభివృద్ధి లేదని అన్నారు. సంక్షేమ పథకాలు గత పాలకుల బినాములకే వర్తించే విధంగా చేశారని అన్నారు ప్రతి బీదవాడికి అందడం లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినంక యనమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి తండా అభివృద్ధికి గ్రామాలు అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు నిధులను కేటాయిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా ఒక గ్రామంలో రెండో లేదా మూడు రోడ్లను ఒక్కొక్క రోడ్డుకు ఐదు లక్షల చొప్పున కేటాయించామని అన్నారు. అవసరం ఉన్న గ్రామంలో కేటాయించామని తెలిపారు నియోజకవర్గానికి రూ.13 కోట్ల రూపాయల తో నియోజకవర్గంలోని ప్రతి మండలానికి సరిచేసుకుంటూ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్నామని అన్నారు.  అంతే కాకుండా కేవలం నెల్లికుదురు మండలానికి ఎన్ఆర్ఈజీఎస్ లో రెండు కోట్ల 40 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించిన మండలంలో 52 మందికి వచ్చాయని అన్నారు. ఒక్కొక్కరికి ఒక లక్ష రూ.116 రూపాయలను అందిస్తుందని అన్నారు. 52 మందికి మొత్తం రూ. 52 లక్షల 632 రూపాయలు అయిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కు సంబంధించిన పేదింటి ఆడపడుచులకు ఒక లక్ష రూ.116 రూపాయలతో పాటు  ఒక తులం బంగారం ఇస్తానని హామి ఇచ్చామని, అది త్వరలోనే పూర్తవుతుందని తెలిపాడు. అనంతరం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వార్డు సభ్యుడు మంచాల వెంకన్న మృతిచెందగా ఆయన ప పార్డవ దేహానికి వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి  సత్యపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి వెంకటేశ్వర్లు ఆ పార్టీ జిల్లా నాయకులు బాలాజీ నాయక్ కాసం లక్ష్మారెడ్డి తో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ధనవంతు కృషి చేస్తారని అన్నారు తెలిపారు. ఆయన మృతి చెందడం ఎంతో బాధాకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తాసిల్దార్ కోడి చింతల రాజు పిఆర్ఏఈ రాజశేఖర్ నాయకులుజిలకర యాలాద్రి సుందర్ తోతాద్రి సతీష్ వీరన్న రాస వెంకటరెడ్డి రేఖ అశోక్ మౌనేందర్ పూర్ణచందర్ మద్ది రాజేష్ క్రాంతి రెడ్డి శ్రీశైలం కృష్ణ పట్నాoశెట్టి నాగరాజు నెలకుర్తి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love