ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం బిజెపి : డాక్టర్ పరకాల ప్రభాకర్

నవతెలంగాణ-సూర్యాపేట : భారతదేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలు అయిన లౌకిక ప్రజాస్వామ్యం,సామాజిక న్యాయానికి పబ్లిక్ రంగ సంస్థల కు బిజెపి ప్రమాదకారిగా తయారైందని  రచయిత, రాజకీయ ఆర్థిక విశ్లేషకులు డాక్టర్ పరకాల ప్రభాకర్ విమర్శించారు. పౌర ప్రజాస్వామిక వేదిక ఆద్వర్యంలో గురువారం రాత్రి స్ధానిక ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రమాదంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం అనే అంశంపై జరిగిన సెమీనార్ లో ఆయన ప్రసంగించారు. భారత పౌరుల పై ఒక ఉన్మాద భావోద్వేగ విషప్రయోగం చేస్తూ దేశసంపదను కొన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తున్న బిజెపి ని ఓడించాలని ఆయన పిలుునిచ్చారు. ప్రజావ్యతిరేక విధానాలను ప్రశించిన వారిని దేశద్రోహులుగా చిత్రికరిస్తున్నారని పేర్కొన్నారు. భారత వ్యవసాయాన్ని దెబ్బ తీసే రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయొద్దని నిరసన తెలిపిన రైతుల పై సైన్యాన్ని ఉపయోగించి రైతులను ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. ఎలక్ట్రో రల్ బాండ్ల పేరుతో క్విడ్ ప్రోకో ద్వారా అవినీతిని చట్టబద్ధం చేశారనీ ఆరోపించారు.ఇప్పటికే అప్రకటితంగా రాజ్యాంగాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. దేశంలో రాజ్యాంగ విలువలు రక్షించ బడాలి అంటే బిజెపి నీ ఓడించాల్సిందే నని ఆయన అన్నారు.ఈ సెమినార్ లో  కుంచం చంద్రకాంత్, వీరేశ్ నాయక్ లు సమన్వయ కర్తలు గా వ్యవహరించగా తెలంగానా జనసమితి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్మార్జున్ ,టి పీజాక్ నాయకులు రవి చందర్  లు ప్రసంగించారు పలువురు ప్రజసంఘ నాయకులు డాక్టర్ లు న్యాయవాదులు పాల్గోన్నారు.
Spread the love