ఎంపీడీవోకు దేశ వ్యాప్త సమ్మె నోటీస్ ఇచ్చిన గ్రామ పంచాయతీ కార్మికులు

– కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసన దేశ వ్యాప్త సమ్మె
నవతెలంగాణ – తొగుట
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మె కొనసాగు తుందని గ్రామపంచాయతీ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ మండలాధ్యక్షులు మస్కూర్ శంకర్ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీధర్ కు 16వ తేదీ దేశవ్యాప్త సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరి స్తున్న విధానాలకు నిరసనగా ప్రజా, కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలకు నిరసన గా దేశవ్యాప్త సమ్మె చేస్తున్నట్లు పేర్కొన్నారు. జాయింట్ ప్లాంట్ ఫాం ఆఫ్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగుతుందన్నారు. (ఐఎన్టి యుసి, ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్యు, ఐఎఫ్టియు, బిఆర్టి యు, టిఎన్టియు, సిఏఐయుటి యుసి) కార్మిక సంఘాలు,వివిధ రంగాల ఉద్యోగ సంఘాలు, అఖిలభారత ఫెడరేషన్,సంయుక్త కిసాన్ మోర్చా (రైతు-వ్యవసాయ కార్మిక సంఘాల ఐక్యవేదిక) ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 16న అఖిల భారత స్థాయిలో కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్ పాటించాలని కోరుతున్నామన్నారు.ఈ సమ్మెలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులందరు పాల్గొంటారని తెలిపారు. సమ్మె నోటీసు అందించిన వారిలో గ్రామ పంచాయతీ కార్మికులు మల్లేశం, నర్సింలు, ప్రభాకర్, యాదగిరి, కొమురయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love