నవతెలంగాణ – హైదరాబాద్ : మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ప్రభుత్వం భద్రత కుదించింది. ఆయనకు ‘Y కేటగిరి’ భద్రతను ప్రభుత్వం కేటాయించింది. మాజీ మంత్రులకు 2+2 భద్రతను పోలీస్ శాఖ కేటాయించింది. మాజీ ఎమ్మెల్యేలకు పూర్తిగా భద్రత తొలగించింది. వారికి కేటాయించిన గన్‌మెన్లను పోలీసు ఉన్నతాధికారులు వెనక్కి పిలిపించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరెవరికి భద్రత అవసరమనే అంశంపై.. ఉన్నతాధికారులతో సమీక్షించి అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటెలిజెన్స్ నివేదిక మేరకు గన్‌మెన్లను పోలీసు శాఖ కేటాయించనుంది.