గల్లిగల్లిలో పైసల లొల్లి

– ప్రధాన పార్టీలు పంచుతున్న వైనం
– మాకు ఇంకా డబ్బు అందలేదని పోలీసులకు ఫిర్యాదు
నవతెలంగాణ కంటేశ్వర్: అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గల్లిగల్లిలో పైసలు లొల్లి మొదలైంది. మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియిడంతో ప్రధాన పార్టీలు గల్లీ గల్లీలలో పైసలు పంచే కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. ప్రధానంగా మూడు పార్టీలు తమ తమ కార్యకర్తలకు వారి పార్టీ సభ్యులకు డబ్బులు పంచే కార్యక్రమంలో భాగంగా గల్లీలలో ఒక ఇంటికి వెళ్లి ఇవ్వడం మరో ఇంటికి వెళ్లకుండా వెళ్లిపోవడంతో ప్రజలు ప్రధాన పార్టీలపై తిట్ల వర్షం కురిపించారు. తమకు అవసరం ఉన్నప్పుడు ప్రధాన పార్టీలు ర్యాలీలకు బహిరంగ సభలకు తీసుకు వెళ్తూ 200 నుంచి 500 వరకు ఇచ్చారు.
ఇప్పుడు గల్లీలలో ఓటుకు వెయ్యి నుంచి 5000 వరకు పంచుతున్నారని తెలియడంతో స్థానిక ప్రజలు తమకు కూడా డబ్బులు వస్తాయని పంచే వారి దగ్గరికి వెళ్తే మీరు మా పార్టీ కాదు కదా మేము ఎందుకు ఇవ్వాలి?  అంటూ వెనక్కి పంపుతున్నారు. దాంతో ప్రజలే పోలీసులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేయడంతో అర్థరాత్రి వరకు పంచుతున్నటువంటి డబ్బులను పోలీసులు వస్తున్నారని సమాచారం అందుకున్న పార్టీ కార్యకర్తలు వెంటనే గల్లిలలో నుండి మాయమయ్యారు. బుధవారం ఉదయం 4, 5 గంటల నుండే డబ్బులు పంపకాలు మొదలైయ్యాయి. అపార్ట్మెంట్లు, కుల సంఘాల వారికి సుమారు 15 వేల చొప్పున అందజేస్తూ మధ్యాన్ని సైతం పంచిపెట్టారు. పెద్ద పెద్ద వారిని గుర్తించి మరి వారి ఇంటికి వెళ్లి డబ్బులను పంపిణీ చేశారు. చిన్న చిన్న గల్లీలను ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రస్తుతం పోటీలో ఉన్న అభ్యర్థులను డబ్బులు రాని కొంతమంది ప్రజలు నిలదీస్తున్నారు. మేము ఎందుకు ఓటు వేయాలి మేము ఓటు వేయము అని నినాదం పలుకుతున్నారు. ఇలా డబ్బులు పంచి ఓట్లు వేయించుకుంటే నిజాయితీపరులను ఎలా ఎన్నుకునేది? అంటూ నిజామాబాద్ నగరంలోని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికి జవాబుదారు ఎవరు అని అడుగుతున్నారు.

Spread the love