నవతెలంగాణ – హైదరాబాద్: ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు చెలరేగింది. శుక్రవారం మొదలైన మంటలు శనివారం నాటికి నైనిటాల్‌లో మరింత తీవ్రం కావడంతో వాటిని అదుపులోకి తీసుకురావడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సహాయం కోరింది. దీంతో భారత వైమానిక దళ సిబ్బంది Mi-17 హెలికాప్టర్‌ను ఉపయోగించినట్లు బ్యాంబి బకెట్ ఆపరేషన్ ద్వారా నీళ్లను మంటలపై వెదజల్లుతున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో నైనిటాల్ హైకోర్టు కాలనీ వాసులకు ముప్పు ఏర్పడింది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌పై కూడా తీవ్ర ప్రభావం పడింది.