ఉత్తరాఖండ్‌లో క్లోరిన్‌ గ్యాస్‌ లీక్‌

నవతెలంగాణ -డెహ్రాడూన్‌ :    క్లోరిన్‌ గ్యాస్‌ లీకైన ఘటన మంగళవారం  ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకుంది. డెహ్రాడూన్‌ సమీపంలోని ప్రేమ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఝంజా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఝంజ్రాలోని ఓ  ఖాళీ ప్లాట్‌లో ఉంచిన క్లోరిన్‌ సిలిండర్‌ లీకేజీ అయినట్లు సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అజయ్  సింగ్‌ తెలిపారు.  గ్యాస్‌ లీక్‌ కారణంగా ప్రజలు తీవ్రమైన శ్వాస ఇబ్బందులను ఎదుర్కొన్నారని అన్నారు. నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని చెప్పారు. సమాచారం అందిన వెంటనే ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఇతర భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని అన్నారు.

Spread the love