నవతెలంగాణ – మెదక్: సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్‌మెన్ ఆకుల నరేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదట భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి.. అనంతరం అతడు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లాలోని చిన్నకోడూర్ మండలం రామునిపట్ల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కలెక్టర్ గన్‌మెన్ నరేష్ ఆత్మహత్యల గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులను నరేష్ భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రిగా గుర్తించారు. ఒకేసారి నలుగురు మృతి చెందటంతో రామునిపట్ల గ్రామంలో విషాదం నెలకొంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.