నవతెలంగాణ మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో తామే విజయం సాధిస్తామని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీట్లను అమ్ముకుంటోందని విమర్శించారు. ‘బీజేపీకి క్యాడర్ కరువు, కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువు` అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. మరోవైపు ఈ నెల 23న మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతోపాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఆసరా పింఛను పెంపును మెదక్ నుంచే సీఎం ప్రారంభిస్తారు. వికలాంగులకు ఆసరా పింఛను రూ.4,016కు పెంచుతున్నట్టు చెప్పారు.