సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..ఆదేశాలు జారీ

నవతెలంగాణ-ఆసిఫాబాద్
పోడు రైతులపై గతంలో ఉన్న కేసులన్నీ ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ డీజీపీని ఆదేశించారు. ఆసిఫాబాద్ లో పోడు రైతులకు పట్టాలు పంపిణీ చేశారు. అలాగే పోడు భూములకు రైతుబంధు విడుదల చేశారు. రూ.23.56 కోట్ల చెక్ ను అందజేశారు. రెండు మూడు రోజుల్లో పోడు పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర ఎకరాలకు 4.06 ఎకరాలు పంపిణీ చేస్తామన్నారు. పోడు భూముల పట్టాలన్నీ మహిళల పేరు మీదనే ఇస్తున్నామన్నారు కేసీఆర్. మారుమూల గ్రామాల్లో అన్ని పొలాల వరకు త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు వచ్చేవని.. మిషన్ భగీరథ నీళ్లతో సీజనల్ వ్యాదులు లేవన్నారు.మెరుగైన పరిస్థితులపై డబ్ల్యూహెచ్ ఓ కూడా ప్రశంసించిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఎదుగుతుందన్నారు. 24 గంటల కరెంట్… ఇంటింటికి నళ్లా నీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

Spread the love