నవతెలంగాణ – ఖమ్మం: ఏండ్ల తరబడి అడవినే నమ్ముకున్న గిరిజన బిడ్డలను ప్రభుత్వం ‘పట్టా’భిషిక్తులను చేస్తున్నది. వారు గోసపడిన చోటే.. వారికి అపూర్వ గౌరవాన్ని అందిస్తున్నది. ఖమ్మం జిల్లా పాల్వంచలోని సుగుణ ఫంక్షన్ హాల్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు పోడు పట్టాలను గిరిజన రైతులకు పంపిణీ చేశారు. అనంతరం అక్కడే జరుగనున్న పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడనున్నారు. ఖమ్మం జిల్లాలో 13,139 ఎకరాలు సాగుచేసుకుంటున్న 6,589 మంది లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేయనున్నారు. భయంభయంగా గడిపిన చోటే ఇప్పటి నుంచి దర్జాగా బతుకుతామంటూ సంబురపడుతున్నారు. తమకు బతుకుదెరువు కల్పించిన సీఎం కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామంటూ చేతులు జోడిస్తున్నారు.