నవతెలంగాణ హైదరాబాద్: ఖమ్మం సభకు కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ మాజీ ఎంపీ మధుయాష్కీతో కలిసి ఆయన డీజీపీ అంజనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని రేవంత్, మధుయాష్కీ కోరారు. అడ్డుగోడలు దాటుకునైనా సభకు హాజరవుతామని నేతలు స్పష్టం చేశారు. సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోకుండా ఆదేశాలిస్తామని నేతలకు డీజీపీ హామీ ఇచ్చారు. అనంతరం హైదరాబాద్ నుంచి ఖమ్మం సభకు రేవంత్, మధుయాష్కీ బయల్దేరి వెళ్లారు.