ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను సన్మానించిన హైదరాబాద్ జిందాబాద్

Respect to doctors

నవతెలంగాణ – హైదరాబాద్
హైదరాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతినెలా మొదటి ఆదివారం బీపీ, షుగర్ పేషెంట్లకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు జరిగిన 81వ మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లను శాలువాలు కప్పి మెమెంటోలు అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ వై.మురళీ మనోహర్ రాజు, డాక్టర్ గగులోతు నాగు, డాక్టర్ ఆర్. రవిశంకర్ లను సన్మానించారు. సమాజ సేవకులు రాజీవ్ ఐద్వా నగర కార్యదర్శి K.నాగలక్ష్మి గారు శ్రామిక మహిళ కన్వీనర్ పద్మశ్రీ డాక్టర్లను అభినందించారు. ఈ సందర్భంగా సమాజ సేవకులు రాజీవ్ మాట్లాడుతూ సమాజంలో వైద్యుల ప్రాధాన్యత ఎంతో ఉన్నదని, కరోనా కాలంలో ప్రజల్ని కాపాడిన దేవుళ్ళు డాక్టర్లేనని కొనియాడారు. 81 నెలలుగా బీపీ, షుగర్ మెడికల్ క్యాంపు ద్వారా హైదరాబాద్ జిందాబాద్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఉచిత సేవలు అందిస్తున్న డాక్టర్లను సన్మానించుకోవడం మనందరి బాధ్యతని డాక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ మిమిక్రీ కళాకారులు రమేష్ మాట్లాడుతూ డాక్టర్ల సేవలను సమాజం గుర్తించి, వారికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని అన్నారు. ఈ సభకు హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కె. వీరయ్య అధ్యక్షత వహించారు. సంయుక్త కార్యదర్శి ఎం శ్రీనివాసరావు డాక్టర్లను, అతిథులను వేదికపై ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ కార్యకర్తలు P. శ్రీనివాస్, నాగేష్, రాజమౌళి, మోహన్, సుకుమార్, హస్మిత, సంగీత, D.సైదులు, K.లలిత,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love