నవతెలంగాణ – హైదరాబాద్: రూ.2 లక్షల పంట రుణమాఫీపై త్వరలోనే కార్యాచరణ ఉంటుందని గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో ప్రకటించారు. ‘ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాం. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తాం. భూమాత పోర్టల్ అత్యంత పారదర్శకంగా ఉంటుంది. అప్పులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఛిన్నాభిన్నం చేశారు. దుబారా ఎక్కడ జరిగిందో కనిపెట్టే పనిలో ఉన్నాం’ అని తెలిపారు.