నవతెలంగాణ మెదక్: మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టుబడింది. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద పోలీసులు తనిఖీల్లో 25 లక్షల రూపాయలు పట్టుబడింది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న ఎలాంటి పత్రాలు లేని నగదును పోలీసులు సీజ్ చేశారు.