ఎర్రజెండాను అసెంబ్లీకి పంపించండి

నవతెలంగాణ- నకిరేకల్: పేదల హక్కుల కొరకు పోరాటం చేసే ఎర్రజెండాను అసెంబ్లీకి పంపాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల అన్నారు. సోమవారంమండలంలోనీ  సీపీఐ అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు విజయాన్ని కాంక్షిస్తూ ఓగోడు, నడిగూడెం, వల్లభాపురం,  పాలెం, నోముల, నెల్లిబండ, గొల్లగూడెం గ్రామాలలో అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యం పేదల ప్రజల తరఫున పోరాటం చేసేది ఎర్రజెండా, పేద ప్రజల వెంట ఉంటూ ఇంటి స్థలాల కోసం మండలంలో ఎన్నో పోరాటాలు చేశామన్నారు. ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇస్తామని కేసీఆర్ హామీలు నీటి మూటలుగా మారాలి ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ గా మారి మాటల ప్రభుత్వమే గాని చేతుల ప్రభుత్వం కాదని అన్నారు. సీపీఐ అభ్యర్థి బొజ్జచిన్న వెంకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ కార్మికులు, కూలీల హక్కుల కోసం పోరాటం చేసింది సీపీఐ ఒకటేనని పేర్కొన్నారు. అలాంటి పార్టీ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. మండలంలో రైతులకు వ్యవసాయానికి నీళ్లు అందడం కోసం  పోరాటం చేశామని,  నిస్వార్ధ ప్రజా సేవకుడినైనా తనకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలను లేవనెత్తి  వారి గొంతుకను  అవుతానన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు రాచకొండ వెంకట్ గౌడ్, పట్టణ కార్యదర్శి ఒంటపాక వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు మల్లం మల్లేష్, లకపక రాజు, కొప్పుల అంజయ్య, ఏ సైదులు, ఎరుకలి అంజయ్య, లగిశెట్టి  శ్రీను, చిట్టి పాక విజేందర్, ఒంటెపాక కృష్ణ,  గుడుగుంట్ల  బుచ్చి రాములు పాల్గొన్నారు.
Spread the love