కేసీఆర్ కు భారీ షాక్..రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న జీహెచ్ఎంసీ మేయర్

నవతెలంగాణ-హైదరాబాద్ : తాను రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో తాను కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నానని తెలిపారు. తెలంగాణలో ఇటీవల పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు కీలక నాయకులు పార్టీని వీడుతున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు తండ్రి కే కేశవరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని భావిస్తున్నారు.
నిజామాబాద్ నగర తొలి మేయర్ ఆకుల సుజాత శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ తరఫున మేయర్‌గా తొలిసారి ఆకుల సుజాత 2014 నుంచి 2018 వరకు పని చేశారు. ఈరోజు పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జెండాను కప్పుకున్నారు.

Spread the love