కారు అదుపుతప్పి బోల్తా ఒకరు మృతి

నవతెలంగాణ-కొండపాక 
కుకునూరు పల్లి వద్ద రాజీవ్ రహదారిపై కారు అదుపుతప్పి బోల్తాపడడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం జరిగింది. కుకునూరు పల్లి ఎస్ఐ పుష్ప రాజ్ తెలిప్పిన వరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం అంబసాహెబ్ పేట గ్రామానికి చెందిన గంగపట్నం వంశీ 25 అనే యువకుడు హైదరాబాదులోని అమెజాన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సెలవు రోజుల్లో తన కారు కిరాయికి వెళ్తాడు. ఇదే క్రమంలో శనివారం సాయంత్రం మంచిర్యాలకు కిరాయికి వెళ్ళాడు.  ఆదివారం ఉదయం తిరిగి హైదరాబాదుకు వెళుతున్న క్రమంలో అతివేగంగా అజాగ్రత్తగా వెళుతున్న కారు కుకునూరుపల్లి వద్ద రాజీవ్ రాదారిపై డివైడర్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొని డివైడర్ కు అవతలి వైపు రోడ్డుపై పల్టీ కొట్టింది. దాంతో కారు నడుపుతున్న వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. కారు రోడ్డుపై పడడంతో ఉదయం కొద్దిసేపు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీ భార్య వెంకట సత్యవతి ఫిర్యాదు మేరకు కుకునూరు పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Spread the love