వర్షాలకు కుప్పకూలిన ఇల్లు

 కుప్ప కూలిన మెట్టె సమ్మక్క ఇల్లు
కుప్ప కూలిన మెట్టె సమ్మక్క ఇల్లు

నవతెలంగాణ-మంగపేట : మండలంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇల్లు కుప్ప కూలి నేలమట్టం అవుతున్నాయి. ఇప్పటికే మండలంలోని నర్సింహాసాగర్ గ్రామపంచాయతీ నరేందర్ రావుపేటకు చెందిన తాటి అనురాద, తిమ్మంపేటకు చెందిన పెద్దారపు రాజు, కొత్త మల్లూరుకు చెందిన గుండారపు నాగమణి, రామకృష్ణల ఇళ్లు కూలిపోగా తాజాగా శనివారం తెల్లవారిజామున నరేందర్ రావుపేటకు చెందిన మట్టె సమ్మక్క నగేష్ దంపతుల ఇల్లు కూలి నేలమట్టం అయినట్లు బాదితులు తెలిపారు. అర్ధరాత్రి ఇల్లు కూలడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డామని ఇంట్లోని విలువైన సామాన్లు, నిత్యావసరాలు, కొంత నగదు అందులోనే పోగా కట్టు బట్టలతో కుటుంబం బతికి బయటపడ్డామని బోరుమన్నారు. ప్రభుత్వం ఆదుకోని డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరి చేయాలని గిరిజన కుటుంబం కోరింది.

Spread the love