వరకట్న వేధింపులతో మహిళ మృతి 

– దుఃఖంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు 
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
అదనపు వరకట్నం వేధింపులతో గడిపే నాగమణి వయస్సు (25 సంవత్సరాలు) ఆత్మహత్య చేసుకున్నట్లు సిఐ రమేష్, కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం, సిఐ రమేష్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని యాదగిరి పల్లి ఎస్సీ కాలనీకి చెందిన బూడిద యాదయ్య దేవమ్మ దంపతుల కూతురు గడిపే నాగమణి నీ జనగాం జిల్లా జనగామ మండలం నాగారం గ్రామానికి చెందిన గడిపే సాయిలు జానమ్మ దంపతుల కుమారుడు గడపే ప్రవీణ్ కు 2020 మార్చి 18న అనుకున్న విధంగా పూర్తిగా కట్న కానుకలు ఇచ్చి యాదగిరి పల్లిలో వివాహం జరిపించారు. వివాహం జరిగిన సంవత్సరం కాలం సక్రమంగా సంసార జీవితము కొనసాగించారు. వారికి ఒక కుమారుడు వర్షన్ (మూడు సంవత్సరములు), ఒక కూతురు లక్ష్మీ ప్రసన్న (9 నెలలు) పిల్లలు ఉన్నారు. వివాహం జరిగిన సంవత్సరం తర్వాత నుంచి అదనపు కట్నం తేవాలని భర్త గడిపే ప్రవీణ్, అత్త జానమ్మ, మామ సాయిలు ప్రతిరోజు వేధిస్తున్నారని కుటుంబ సభ్యులతో తెలిపిందని తెలిపారు. గత శుక్రవారం తన అత్తగారి ఇంటి నుంచి పిల్లలతో వచ్చి తల్లిదండ్రుల వద్ద ఉన్నది. శారీరక మానసిక వేధింపులు తట్టుకోలేక యాదగిరి పల్లి ఊరు పక్కనే గల బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది అని తెలిపారు. గ్రామస్తులు కుటుంబ సభ్యులు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆమెను బయటకు తీసి హుటాహుటిన భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి మృతి చెందిందని తెలిపారు. సిఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Spread the love