గురుకులాల్లో తాత్కాలిక  అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

నవతెలంగాణ- తాడ్వాయి
జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు/ జూనియర్ కళాశాలల్లో ఆంగ్ల మాద్యమంలో విద్యా బోధనకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 వరకు పీజీ, బీఈడీలో 50 శాతం మార్కులతో రెండవ శ్రేణిలో ఉత్తీర్ణులై, టెట్ అర్హత సాధించిన వారు కామారెడ్డిలో పట్టణంలోని సరంపల్లిలో నాగిరెడ్డిపేట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. జిల్లాలోని బాలికల గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పాఠశాల విభాగానికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్, బయో సైన్స్,  సాంఘిక శాస్త్రం, పీఈటీ, కళాశాల విభాగంలో తెలుగు, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, గణితం, వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బాలుర పాఠశాలల్లో గణితం, సాంఘిక శాస్త్రం, పీఈటీ పార్ట్ టైం ఉపాధ్యాయులుగా పని చేయడానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బాలికల పాఠశాలల్లో మహిళలు మాత్రమే అర్హులన్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తి పారదర్శకంగా డెమో, మెరిట్ ఆధారంగా చేస్తామన్నారు.
Spread the love