గుండెపోటుతో గొర్రెల పెంపకం దారు మృతి

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామానికి చెందిన కుంట సాంబయ్య గొర్రెల పెంపకందారు శనివారం గుండెపోటుతో మృతి చెందారు. మృతిని భార్య యాకలక్ష్మి కథనం ప్రకారం ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఛాతిలో నొప్పి అంటూ కుప్పకూలి పోయాడని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా పల్స్ పూర్తిగా డౌన్ అయినట్లు తెలిపారు. కృత్రిమ శాసన కోసం ఎంతో ప్రయత్నించిన ఫలితం లేకపోయిందని అన్నారు. మృతునికి భార్యతో పాటు కుమారులు రవి, సంతోష్ లు మరియు వృద్ధుడైన తండ్రి గట్టయ్య ఉన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతు సంఘాల నాయకులు, గొర్రెల పెంపకం దారుల సంఘం నాయకులు పలు రాజకీయ పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

Spread the love