నవతెలంగాణ-గోవిందరావుపేట
భారతీయ రిజర్వ్ బ్యాంకు హైదరాబాద్ ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి విద్యార్థులకు ఆర్ధిక అక్షరాస్యత అనే అంశం పై అఖిలభారత క్విజ్ జిల్లా స్థాయి పోటీలను సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ములుగు లో జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించినారు. ఈ పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చల్వాయి విద్యార్ధినులుడి. కారుణ్య, పీ. వైశాలి ప్రథమ స్థానాన్ని పొందారు. ఇందుకు గాను 10000/-పదివేల రూపాయల నగదు బహుమతిని ములుగు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ అందజేయనున్నారు. ఇట్టి విద్యార్థులు ఈ నెల 10 వ తేదీన హైదరాబాద్ లో జరిగే రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలలో పాల్గొననున్నారని ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరరావు తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు విద్యార్థులను మరియు గైడ్ టీచర్ ఎస్. మురళీధర్ ఎస్.ఏ. గణితన్ని అభినందించినారు.