ప్రాజెక్టు నగర్ పంచాయితీ లో గిరిజనోత్సవం

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని ప్రాజెక్టునగర్( మొట్ల గూడెం) పంచాయతీలో శనివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం గిరిజనోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండలంలో ప్రధమంగా ఏర్పడ్డ గిరిజన పంచాయతీలలో మొట్టమొదటిసారిగా ఏకగ్రీవంగా సర్పంచిని ఎన్నుకున్న గ్రామపంచాయతీ గా మండల చరిత్రలో నిలిచిపోయిన ఈ పంచాయతీని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తహసిల్దార్ అల్లం రాజకుమార్ ఎంపిఓ సాజిదా బేగం మరియు పంచాయతీ కార్యదర్శి శ్రీ తేజ మరియు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పంచాయతీ సర్పంచ్ సనప సమ్మయ్యను శాలువాలతో ఘనంగా సత్కరించారు. గిరిజన ఉత్సవం కార్యక్రమంలో భాగంగా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా పంచాయతీ కార్యాలయాన్ని అందంగా అలంకరించారు.

Spread the love