ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రంలోని గోవిందరాజస్వామి ఆలయంలో సోమవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి భక్తులు పెద్ద సంఖ్యలు సాయి బాబా విగ్రహానికి గురు పౌర్ణమి సందర్భంగా పూజాదీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సాయి తేజ ప్రవచనాలు భక్తులకు చదివి వినిపించారు. గురు పౌర్ణమి సందర్భంగా మాచినేని లక్ష్మి రాజారావు దంపతులు ఆలయంలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గురు పౌర్ణమి వేడుకలను వీక్షించడంతోపాటు అన్నదానంలో పాల్గొన్నారు.

Spread the love