చల్వాయిలో మొదలైన బడిబాట

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కుంజ రాజేశ్వర్ రావు,కరివేద సమ్మిరెడ్డి ల ఆధ్వర్యంలో ములుగు జిల్లా విద్యా శాఖ జయశంకర్ బడిబాట కార్యక్రమం శనివారం ర్యాలీతో ప్రారంభమైనది. ఈ బడి బాట ర్యాలీని గ్రామ సర్పంచ్ ఈసం సమ్మయ్య జెండా ఊపి ప్రారంభించారు.పాఠశాలల ఉపాధ్యాయులు జట్లుగా విడిపోయి చల్వాయి గ్రామంలోని విద్యార్థుల గృహాలను సందర్శించి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొని ఉన్న వసతులను,విద్యా సౌకర్యాలను విద్యార్థుల తల్లిదండ్రులకు వివరిస్తూ,పాఠశాలల్లో నెలకొని ఉన్న సౌకర్యాలను వివరించే కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేయడం జరుగుతోంది.గ్రామంలో విద్యా సర్వే నిర్వహిస్తూ పాఠశాలకు రాకుండా ఉన్న విద్యార్థులను గుర్తించి, కొత్తగా ప్రవేశాలు నమోదు చేయడం జరుగుతోంది.గత సంవత్సరం వేర్వేరు పాఠశాలల్లో చదివిన వివిధ తరగతుల విద్యార్థుల ప్రవేశాలు కూడా చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో చల్వాయి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఉప్పుతల ప్రసాద్, దామరాజు సమ్మయ్య,బూత్కూరి శ్యామ్ సుందర్ రెడ్డి,శ్రీరాముల శ్రీనివాసరావు,అందె రమాదేవి,సుతారి మురళీధర్, భూక్య సరిత,పూసం శ్రీదేవి, రాయబారపు దీప్తి, అంగన్ వాడి టీచర్ అరుణాదేవి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు శివ నాగేశ్వర్ రావు, లావుడ్య రమేష్, మంజుల, సరస్వతి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love