పండగలా ఆర్ఓఎఫ్ఆర్ హక్కు పత్రాల పంపిణీ

నవతెలంగాణ-గోవిందరావుపేట

మండలంలోని రాంనగర్ పంచాయతీలో ఆర్ ఓ ఎఫ్ ఆర్ హక్కు పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ భూక్య మోహన్ రాథోడ్ ఆధ్వర్యంలో ఒక పండుగలా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మోహన్ రాథోడ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిధిలో ఎల్బీనగర్ మాన్య తండా రాంనగర్ గ్రామాలు కలిసి ఉండగా ఆర్వో ఎఫ్ ఆర్ లో భాగంగా సుమారు 400 ఎకరాలకు 123 మంది రైతులకు ఆర్ వై ఎఫ్ ఆర్ హక్కు పత్రాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమం ప్రారంభంలో రైతులు ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, జగదీష్ ల చిత్రపటాలకు క్షీరాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల స్పెషల్ ఆఫీసర్ డిఆర్డిఏ పిడి నాగ పద్మజ హాజరై మాట్లాడుతూ గిరిజన రైతులు ఎన్నో ఏళ్ల శ్రమ ఫలితం ఈ ఆర్ ఓ ఎఫ్ ఆర్ హక్కు పత్రాలు అని అన్నారు. రైతులు రైతుబంధు మరియు రైతు బీమా వ్యవసాయ రుణాలు పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. తాసిల్దార్ అల్లం రాజకుమార్ మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా ఎదుగుదలకు ఈ హక్కు పత్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ హక్కు పత్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. హక్కు పత్రాలు నిర్వహణ కార్యక్రమంలో సర్వే నుండి మొదలుకొని నేటి వరకు సర్పంచ్ మోహన్ కృషి ఎంతో ఉందని అన్నారు. కార్యక్రమానికి హాజరైన అధికారులను రైతులు వేదికపై సత్కరించారు. కార్యక్రమంలో ఆర్ ఓ ఎఫ్ ఆర్ కమిటీ అధ్యక్ష హర్జీ నాయక్, సనప  కృష్ణారావు, పంచాయతీ కార్యదర్శి అంజుం బేగం, రైతులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love