మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కుసుమ జగదీష్

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల కేంద్రానికి చెందిన రెడ్ క్రాస్ చైర్మన్ ,కొత్తపల్లి ప్రసాద్ తల్లి ఇటీవల అనారోగ్యంతో చనిపోగా మంగళవారం ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ మరియు మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయకులు పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి బి ఆర్ఎస్ పార్టీ అన్నివేళలా వారి కుటుంబానికి అండదండగా ఉంటుందని అన్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో గోవిందరావుపేట టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సురపునేని సాయికుమార్, ప్రధాన కార్యదర్శి లకావత్ నరసింహ నాయక్ పృధ్విరాజ్ ఉట్ల గోవిందరావుపేట మీడియా కోఆర్డినేటర్, ఎంపీటీసీ ఆలూరి శ్రీనివాసరావు మండల కోఆప్షన్ సభ్యుడు ఎండి బాబర్ తొలి మలిదశ ఉద్యమకారుడు అజ్మీర సురేష్ భూక్య దేవా తదితరులు పాల్గొన్నారు.

Spread the love