సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సమ్మె..

నవతెలంగాణ-గోవిందరావుపేట
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం లక్ష్యంగా జేఏసీ నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్త సమ్మె చేస్తున్నామని జిపి కార్మిక సంగం మండల జేఏసీ అధ్యక్షులు తండ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో బస్టాండ్ ఏరియాలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె ప్రారంభమైంది. సమ్మెను ఉద్దేశించి తండ కుమార్ మాట్లాడుతూ..  గ్రామపంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలి.11 వ పిఆర్ సి నిర్ణయించిన బేసిక్ ప్రకారం కనీస వేతనం రూ 19000/- లను వేతనంగా చెలించాలి , అలోపు జీఓ నెం 60 ప్రకారం సీపర్లకు 15600/- పంపు ఆపరేటర్లకు ఎలక్ట్రియను , డ్రైవర్,కరోబార్, బిల్ కలెక్టర్లు రూ 19500/- లు చెల్లించాలి. ప్రమాదం జరిగి మరణించిన కర్మికుని కుటుంబానికి రూ 10 లక్షల నష్ట పరిహరని ప్రభుత్వం చెలిచాలి. జీఓ నేం 51 సవరించి, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో జిపి కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు అనుమల వెంకన్న ప్రధాన కార్యదర్శి దుస్సా సతీష్, సీతారాములు, ఉప్పలయ్య, కృష్ణ, రాజు, సమ్మక్క, సాంబయ్య, సంజీవరెడ్డి, చంద్రశేఖర్, ఆనంద్, విజేందర్, వట్టం సాంబయ్య, లక్ష్మీనారాయణ, జుమ్మిలాల్, గణేష్ లాల్, సీతారాం, కంటెం సౌజన్య, ఎదుల శంకర్, మోహన్ రెడ్డి, రాజయ్య, సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
Spread the love