పసర త్రాగునీటి సమస్యపై స్పందించిన అధికారులు

నవతెలంగాణ – గోవిందరావుపేట
గత పది రోజులుగా త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్న పసర గ్రామస్తుల సమస్యను పరిష్కరించేందుకు అధికారులు మంగళవారం స్పందించారు. మండల స్పెషల్ ఆఫీసర్ డిఆర్డిఏ నాగపద్మజ మరియు ఎంపీవో సాజిదా బేగం లు త్రాగునీటి పైప్ లైన్ దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. ఇన్ని రోజులుగా త్రాగునీటి సమస్య ఎదురవుతుంటే ఎందుకు ఆలస్యం చేశారంటూ పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని పంచాయతీ కార్యదర్శి పూణెం శరత్ బాబును ఆదేశించారు. బుధవారం సాయంత్రానికి త్రాగునీరు అందేలా చర్యలు చేపడతానని కార్యదర్శి శరత్ అధికారులకు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

Spread the love