పసర లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో కాంగ్రెస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం గ్రామ కమిటీ అధ్యక్షులు బద్దం లింగారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.  రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గ్రామ గ్రామాన ఊరు వాడవాడల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు లింగారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పసరా కాంగ్రెస్ గ్రామ కమిటీ సభ్యులు మహిళా నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love