గ్రామపంచాయతీ సిబ్బంది డిమాండ్లను నెరవేర్చాలి: పాలడుగు వెంకట కృష్ణ

నవతెలంగాణ-గోవిందరావుపేట
గ్రామపంచాయతీ సిబ్బంది న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలో న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటు గ్రామపంచాయతీ సిబ్బంది  డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త అఖిలపక్ష సమ్మెకు పిలుపునివ్వగా ఆ సమ్మెకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెంకటకృష్ణ సంఘీభావం తెలిపి మాట్లాడారు.కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ పంచాయితీ కార్యదర్శులుగా ప్రకటించి శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. సిబ్బందికి ఉద్యోగ భీమా కల్పించాలని, ఉద్యోగంలో మరణించిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియా ప్రకటించాలని కోరారు.శ్రమకు గౌరవం లేని పని చేస్తున్న పారిశుధ్య కార్మిక సిబ్బందికి గౌరవ వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రమకు గౌరవం లేని పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు గౌరవ వేతనం కల్పించాలని, ప్రతి నెల జీతాలు సమయానికి అందించాలని కోరారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రమదరీత్యా మరణించిన కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేసియా ప్రకటించి వారి కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే ఉద్యోగ భీమా, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామంలో వ్యర్ధాలను తొలగించి, గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దిన పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం అండగా నిలబడి, వారిని ప్రభుత్వ సేవకులుగా గుర్తించి ప్రభుత్వమే జీతభత్యాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, సహకార సంఘ పాలకవర్గ సభ్యులు జెట్టి సోమయ్య, స్థానిక ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, మండల మహిళా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, జంపాల చంద్రశేఖర్, పొన్నం సాయి, గోపిదాసు వజ్రమ్మ, కట్ల ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
Spread the love