దాదా సింగ్ వ్యవసాయ విస్తరణ అధికారి

నవతెలంగాణ – గోవిందరావుపేట
వర్షాధార పంటల సాగు వివరాలను సేకరిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి (రంగాపూర్ క్లస్టర్) దాదా సింగ్ తెలిపారు. గురువారం మండలంలోని ప inసర గ్రామంలో చెరువులు కుంటలు బోరు బావులు కింద రైతులు ఎవరెవరు ఎన్ని ఎకరాలను ఏ పంటలు సాగు చేస్తున్నారు తదితర వివరాలను సమగ్రంగా సేకరించడం జరిగిందన్నారు. రైతులు కూడా ఈ సేకరణలు అధికారులతో సహకరించి పూర్తి వివరాలను అందించాలని సూచించారు. దీనివల్ల ఏ ఏ పంటలు మండలంలో ఎంత విస్తీర్ణంలో సాగు అవుతున్నాయి ఆయా పంటలకు ఎరువులు ఎంత మాత్రం అవసరం ఉంటాయి అనే వివరాలను ఉన్నతాధికారులకు అందించే వీలు ఉంటుందని అన్నారు. రంగాపూర్ క్లస్టర్లు పూర్తి సాగు విస్తీర్ణం సేకరించే కార్యక్రమానికి రైతులు ప్రజాప్రతినిధుల తోడ్పాటు ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముద్దబోయిన రాము పలువురు రైతులు పాల్గొన్నారు.

Spread the love