ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన టి ఎస్ ఆర్ టి సి…

నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో లో గురువారం రోజున ఉద్యోగుల అభినందన సభనిర్వహించడం జరిగినది ముఖ్యఅతిథిగా జిల్లా రీజినల్ మేనేజర్ శ్రీమతి టి ఉషాదేవి విచ్చేసినారు ఈ సందర్భంగా మాట్లాడుతూమన సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఎండి విసి సజ్జనర్ గారు వచ్చిన తర్వాత నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో తేవడానికి సంస్థ యజమాన్యం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది ఉద్యోగులను ప్రోత్సహించేందుకు కొత్త మార్పుకు శ్రీకారం మరియు T.A.C.T వంటి వారం రోజులపాటు మేధావులతో శిక్షణ తరగతులను అందించినారు అంతేకాకుండా ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స అందించి ఉద్యోగులకు మేమున్నాం అంటూ సంస్థ యజమాన్యం భరోసా కల్పించింది ప్రయాణికుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతివారం అధికారులు బస్సుల లో ప్రయాణించడం జరుగుతుందని మరియు డయల్ యువర్ డిఎం ప్రోగ్రాం ద్వారా ప్రయాణికుల సమస్యలు తెలుసుకుంటున్నారు ఆర్టీసీ ప్రయాణికులు ఆకర్షించేందుకు చిల్డ్రన్స్ డే మరియు మదర్స్ డే కు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని మరియు దసరా సంక్రాంతి పండగలకు ఎటువంటి అదనపు చార్జి లేకుండా ప్రత్యేక బస్సులను నడిపించడం జరిగిందని ప్రతినెల అధిక ఆదాయం తెచ్చిన కండక్టర్లకు మరియు అధిక ఇంధన పొదుపు చేసిన డ్రైవర్లకు నగదు ప్రోత్సాహక బహుమతులను సంస్థ యజమాన్యం కల్పించిందని కావున ఉద్యోగులందరూ సమిష్టిగా కృషిచేసి డిపో అభివృద్ధికి మరియు సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరినారు ఆర్మూర్ డిపో మేనెలలో పెండ్లిల సీజన్ కారణంగా డిపో మేనేజర్ గారు ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నందున ఆర్మూర్ డిపోకు లాభాలు వచ్చాయని ఉద్యోగులందర్నీ అభినందించారు అధిక ఆదాయం తీసుకువచ్చిన కండక్టర్లకు మరియు అధిక ఇంధనం పొదుపు చేసిన డ్రైవర్లకు నగదు ప్రోత్సాహకాలు అందజేసినారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రీజినల్ మేనేజర్ శ్రీమతి టి ఉష దేవి గారు డిపో మేనేజర్ శ్రీమతి కె. కవిత గారు ఎం.ఎఫ్ గంగా కిషన్ గారు ఎస్ టి ఐ పారుగారు ఈ డబ్ల్యూ బి మెంబర్ నాగేశ్వర్ గారు సాయిల్ గారు . చక్రవర్తి గారు కండక్టర్లు ,డ్రైవర్లు మెకానిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love