– తెలంగాణ బిసి రాష్ట్ర మహిళా కార్యదర్శి అరుణ జ్యోతి
నవతెలంగాణ – ఆర్మూర్
దేశ ప్రజల హృదయాలను మెలిపెట్టిన ఒడిశా రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ బిసి రాష్ట్ర మహిళా కార్యదర్శి అరుణ జ్యోతి ఆదివారం తెలిపారు. రైలు ప్రమాదం అత్యంత బాధాకరమని, రైలు ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల ఆదుకోవాలని, అలాగే మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం క్షతగాత్రులను ఆస్పత్రి వద్ద పరామర్శించడం చనిపోయిన మృత దేహాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించడం సాధారణంగా మారుతుందే తప్ప ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు తీసుకోవడంలో లోపం కనబడుతోందని అన్నారు. వివిధ రాష్ట్రాలకి చెందిన వందలాదిమందికి పైగా మృతి చెందినట్లు వార్తలు బాధ కలిగిస్తూన్నాయని చనిపోయిన మృతులకు సంతాపం వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతిని వ్యక్తం చేశారు. భవిష్యత్తు లో రైళ్లు ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు..