వైయస్సార్ సి పి అధ్యక్షుల నియామకం

నవతెలంగాణ – ఆర్మూర్
మెండోరా మండల అధ్యక్షురాలుగా రెడ్డి అమ్మాయి, ఉపాధ్యక్షుడిగా రత్నం సత్యనారాయణ లను నియమించినట్టు నియోజకవర్గ కోఆర్డినేటర్ పిప్పెర లావణ్య మంగళవారం తెలిపారు. తెలంగాణ పార్టీ అధినేత్రి శర్మిలా ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా పరిశీలకులు గట్టు రామ చందర్ ,నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు గౌతం ప్రసాద్ సూచనల మేరకు బాల్కొండ నియోజక వర్గ కో ఆర్డినేటర్ పిప్పెర లావణ్య గారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బాల్కొండ నియోజకవర్గం YSRTP మెండోరా మండల అధ్యక్షురాలుగా రెడ్డి అమ్మాయి, ఉపాధ్యక్షుడిగా రత్నం సత్యనారాయణ గారిని నియమించడం జరిగింది. నియామక పత్రాలను బాల్కొండ నియోజకవర్గం కోఆర్డినేటర్ పిప్పెర లావణ్య అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీకి, షర్మిలమ్మ పోరాటలకు ఆకర్షితులై చాలా మంది చేరుతున్నారని, రాబోయే రోజుల్లో భారీ ఎత్తున పార్టీలో అనేక మంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పార్టీలో కచ్చితంగా గుర్తింపు ఉంటుంది.వచ్చేది రాజన్న రాజ్యమే రాజన్న రాజ్యం వస్తేనే మన బతుకులు మార్పు వస్తుందని షర్మిలమ్మకు ఒక అవకాశం ఇవ్వాలని బాల్కొండ నియోజకవర్గం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కోఆర్డినేటర్ పిప్పెర లావణ్య కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love