నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని గోవింద్ పెట్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు శనివారం. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి ప్రతినిధులచే కరపత్రాల ఆవిష్కరణ నిర్వహించినట్టు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి మాడ వేడి పద్మావతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బండమీది జమున గంగాధర్, ఎంపీటీసీ యల్లా రాజకుమార్, ఎస్ఎంసి చైర్మెన్ సయ్యద్ అంజాద్ వీడీసీ అధ్యక్షులు లింగన్న సొసైటీ చైర్మెన్ బంటు మహిపాల్ సచివాలయ వార్డు సభ్యులు సిబ్బంది, ఉపాధ్యాయ బృందం బావాయి, నౌషీన్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.