నవతెలంగాణ – ఆర్మూర్
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బుధవారం పలు అంగన్వాడి కేంద్రాల్లో ఆరు నెలలు నిండిన పిల్లలకు బాలామృతం తో పాటు అన్న ప్రసన్న చేయడం జరిగిందని అంగన్వాడి సూపర్వైజర్ శ్రీదేవి బుధవారం తెలిపారు.. నాగపూర్ అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన అన్న ప్రసన్న కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు అన్న ప్రసన్న చేయడం జరిగింది.. తల్లి పాలతో పాటు బాలామృతం పిల్లలకు అందించడం ద్వారా పిల్లల వయసుకు తగ్గ బరువు ఎత్తు ఉంటారని, అంగన్వాడి ద్వారా అందించే అన్ని సేవలను వినియోగించుకోవాలని అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.