కాంగ్రెస్ సీనియర్ నాయకులు కంటెం మొగిలి మృతి..

నవతెలంగాణ-గోవిందరావుపేట
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంటెం మొగిలి సోమవారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మొగిలి మృతి పార్టీకి తీరని లోటని ఆ పార్టీ మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ అన్నారు. మొగిలి భౌతిక గాయం పై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు మొగిలి అహర్నిశలు కృషి చేశారని మొగిలి మృతి పార్టీకి నిజంగా తీరని లోటు అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, చల్వాయి గ్రామ ఉపసర్పంచ్ తేళ్ల హరిప్రసాద్, ఎస్.సి.సెల్ మండల అధ్యక్షులు పడిదల సాంబయ్య, మండల మహిళా అధ్యక్షురాలు మద్దాలి నాగమణి, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, కంటెం సూర్యనారాయణ, కోరం రామ్మోహన్ పూజారి సాంబశివరావు, పులుసం లక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు.
Spread the love