క్విజ్ పోటీలలో యువత అధికంగా పాల్గొనాలి 

– బానోతు రవి చందర్ ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట 
రాజీవ్ గాంధీ అంతర్జాల పీస్ కార్యక్రమంలో యువత అధికంగా పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని ములుగు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రవిచందర్ అన్నారు. ఆదివారం మండలంలోని రామ్ నగర్ గాంధీనగర్ మరియు బాలాజీ నగర్ గ్రామాలలో క్విజ్ కార్యక్రమం పై విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిచందర్ మాట్లాడుతూ ప్రియాంక గాంధీ  యూత్ డిక్లరేషన్ స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో యువత యొక్క మేధస్సుని వెలికితీయ రాజీవ్ గాంధీ అంతర్జాల క్విజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినదని కావున ములుగు జిల్లా నుండి యువత అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందని, ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పి కేసీఆర్ యువతను మోసగించి గద్దెనెక్కాడని, గత ఎన్నికల సమయంలో నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి నమ్మించి అధికారం చేజిక్కించుకున్న కేసీఆర్ నాలుగున్నర యేండ్లు గడిచిన ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని అన్నారు.  యువత భవిష్యత్తుని నిర్వీర్యం చేస్తూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా రాష్ట్ర విద్యార్థుల పాలిట శాపంగా కేసీఆర్ మారిపోయాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇచ్చి పేద విద్యార్థుల ఉన్నత చదువుకు సహాయపడుతుంది అని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి యువత భవిష్యత్తుని నిర్మిస్తామని, నిరుపేద విద్యార్థులను ఆదుకుంటామని ప్రియాంక గాంధీ గారి యూత్ డిక్లరేషన్ సభలో స్ఫష్టంగా చెప్పారని అన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో యువత మేధస్సుని మేల్కొలపడానికి, నైపుణ్యతను వెలికి తీయడానికి రాజీవ్ గాంధీ అంతర్జాల క్విజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువతకి క్విజ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసి ఉత్తీర్ణులైన మొదటి నలభై మందికి ప్రోత్సాహకర బహుమతులు అందజేస్తున్నామని అన్నారు. ఈ కాంపిటీషన్ యందు పేరుని నమోదు చేయడానికి 7661899899 అను నెంబరుకు మీ యొక్క మొబైల్ నెంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వగానే మీకు మెసేజ్ రూపంలో ఒక లింక్ వస్తుంది అని, అట్టి లింకును క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు తెలిపి, రిఫరల్ కోడ్ దగ్గర ములుగు నియోజకవర్గం వారు 1129 అను నెంబరు ఇచ్చి సమర్పించగా మీ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి అయినట్టు మీ మొబైల్ నెంబరుకు మెసేజ్ వస్తుంది ఇట్టి అవకాశం ఈ నెల 17 వరకు మాత్రమే ఉందని, కాబట్టి యువత వెంటనే రాజీవ్ గాంధీ అంతర్జాల క్విజ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని, అలాగే  ఈనెల 18 వ తారీకున అంతర్జాల పరీక్ష ఉంటుందని, 60 ప్రశ్నలు 60 నిమిషాలతో కూడిన పరీక్ష అయిపోగానే నియోజకవర్గంలో పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళకు ఎలక్ట్రిక్ స్కూటీ బహుమతిగా అందజేయబడుతుందని అన్నారు. అలాగే ఉతీర్ణత సాధించిన మొదటి నలభై మందికి ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, ట్యాబ్, స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంకు లాంటి ఆసక్తికరమైన బహుమతులు అందజేయబడును. కావున ములుగు జిల్లా యందు గల యువత అధికంగా ఇట్టి అంతర్జాల పరీక్ష యందు పాల్గొని తగిన బహుమతులు గెలుచుకోవాలని ఆశిస్తున్నా అని అన్నారు.  ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి, ములుగు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంగోత్ వంశీ, , అజ్మీర సమ్మాలు, యూత్ గ్రామ అధ్యక్షులు అశోక్, కట్ల జనార్దన్ రెడ్డి, బొల్లు కుమార్, కందుల అశోక్, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి భూక్య సారయ్య, భూక్య రాజు, పాడియా రాజు, జాటోత్ చంద్రకాంత్, ధారవత్ ఉష, భూక్య సుక్య, గ్రామ అధ్యక్షుడు ఈర్య, రవీందర్, పూనమ్మ మరియు యువ నాయకులు పాల్గొన్నారు.
Spread the love