కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల ఉపాద్యక్షుడిగా స్వామి

నవతెలంగాణ – కోహెడ
మండల కేంద్రానికి చెందిన గూడ స్వామి ని ఎస్ స్సీ సెల్ మండల అధ్యక్షుడు గా గూడ స్వామి ని నియామకం చేసినట్లు ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు చింతకింది శంకర్ తెలిపారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా మంద దయాకర్ నియమకo చేసినట్లు తెలిపారు. ప్రధాన కార్యదర్శి మంద దయాకర్ మాట్లాడుతూ మా నియమానికి సహకరించిన ఎస్సీ సెల్ స్టెట్ ఛైర్మన్ ప్రీతీమ్, ఎస్సీ సెల్ జిల్లా ఛైర్మన్ విజయ్ కూమార్, మాజీ ఎంపి పోన్నం ప్రభాకర్ గౌడ్, మాజీ ఎమ్మెల్యె అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మండల అద్యక్షుడు మంద ధర్మయ్య, టిపిసిసి బిసి సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ తాళ్ళపల్లి శ్రీనివాస్, మండల ముఖ్యనాయకులందరికి ధన్యవాదములు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపెతానికి మా వంతు కృషి చెస్తామని అన్నారు.  ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అద్యక్షుడు మహమ్మద్ అంకుశ్ , మండల కార్యదర్శి వెల్పుల వెంకట స్వామి ,సీనియర్ నాయకులు గడ్డం దుర్గా రెడ్డి , సుదగోని మధు, నంగునూరి శ్రీనివాస్,చల్లూరి అంజయ్య ,బైరి సుధాకర్,వెల్పుల లింగయ్య,గాలిపల్లి లింగయ్య తదితరులు పాల్గోన్నారు.

Spread the love